News

చకచక అయోధ్య రామాలయం పనులు

397views

వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కళాకారులు గ్రౌండ్‌ ఫ్లోర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆలయ తలుపులు, గోపురానికి బంగారు తాపడం పని మొదలైంది. అందులో భాంగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 14 తలుపులను ముందుగా రాగితో తాపడం చేస్తారు. అనంతరం దానిపైన బంగారు పూత పూస్తారు. దీని కోసం దిల్లీకి చెందిన కళాకారులు ఆయోధ్య చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాల కోసం ట్రస్ట్‌ సభ్యులు ప్రణాళిక రూపొందించారు. జనవరి 22న ప్రధాని హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామమందిరం కాంప్లెక్స్‌కు వస్తారు. అనంతరం 100 మీటర్లు నడిచి గర్భగుడి వద్దకు చేరుకుంటారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున.. సాధారణ భక్తులు జనవరి 26 నుంచి శ్రీరాముడిని దర్శించుకోవడానికి రావాలని ట్రస్ట్‌ కోరింది. మరోవైపు.. శ్రీరాముడి బంగారు కిరీటంలో పొదిగేందుకు వజ్రాలు సమర్పిస్తానని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ప్రాతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై ట్రస్ట్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.