
241views
గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. విద్యుత్తు ఇంజిన్ ఉన్న ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులా రూపొందించారు. ఇంటీరియర్ డిజైన్ అంతా చెక్కతో చేశారు. మూడు బోగీలున్న ఈ రైలు ఐక్యతా విగ్రహం ఉన్న కెవఢియా, అహ్మదాబాద్‌ల మధ్య నడవనుంది. ఇందులో 144 మంది ప్రయాణించవచ్చు. 28 సీట్ల సామర్థ్యమున్న ఏసీ రెస్టారెంట్ ఉంటుంది. టీ, స్నాక్స్ అందిస్తారు. ప్రస్తుతానికి నవంబరు 5వ తేదీ నుంచి ప్రతి ఆదివారం నడవనుంది. రద్దీని బట్టి ట్రిప్పులను పెంచుతారు.





