
439views
చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేకోత్సవాల్లో ఉభయ దేవేరులతో కలసి స్వామివారు గురువారం రాత్రి కల్పవృక్ష వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించారు. వేకువజామున స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.





