
335views
ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేసేత పై విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఢిల్లీలో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం నడుస్తోందని స్ఫష్టం చేసారు. ఢిల్లీలోని ఎంబసీ, ముంబై, హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లలో పనిచేస్తున్న ఆఫ్ఘన్ దౌత్యవేత్తలతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. చాలా కాలంగా ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్‌లో రాయబారి లేరని, ఇటీవల పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ సహకారం కొనసాగిస్తుందని.. భారతలో పెద్ద సంఖ్యలో చదువుతున్న ఆఫ్ఘన్ విద్యార్థులకు, పౌరులకు అవసరమైన దౌత్యపరమైన మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు.





