News

ఆసియా క్రీడల్లో 80కి చేరిన భారత్‌ పతకాల సంఖ్య

188views

2023 ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా బంగారు పతాకాన్ని సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు.

గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం​ సాధించిన కిషోర్‌ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్‌, కిషోర్‌ ఇద్దరు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

కాగా, జావెలిన్‌ త్రోలో రెండు పతకాలతో (స్వర్ణం, వెండి) భారత్‌ పతకాల సంఖ్య 80కి చేరింది. పతకాల పట్టికలో 17 స్వర్ణం, 31 వెండి, 32 కాంస్య పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో 168 స్వర్ణం, 93 వెండి, 51 బ్రాంజ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుంది. జపాన్‌ 144 మెడల్స్‌తో 36 స్వర్ణం, 51 వెండి, 57 కాంస్య పతకాలతో రెండో స్థానంలో, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 145 పతకాలతో 33 స్వర్ణం, 44 వెండి, 68 కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి.