
ధర్మజాగరణ సమితి నంద్యాల ఆధ్వర్యంలో శ్రీ శారదా విద్యా పీఠం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఫారూఖ్ నగర్ లో స్లో సైక్లింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను శ్రీ సముద్రాల ఆంజనేయులు గారు భారతమాతకు మాలార్పణ గావించి ప్రారంభించారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీ వై.రాంప్రసాద్ గారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థులలో గెలుపు ఓటములు సమానంగా తీసుకునే మానసిక స్థితిని కలిగించి ఆత్మహత్యకు పాల్పడకుండా చేస్తాయని తెలిపారు. శ్రీ నాగరాజుగారు మాట్లాడుతూ, పోటీలు నియమానుసారంగా ఆడటంవలన ప్రతి విషయంలో నియమపాలన అలవడుతుందని పేర్కొన్నారు. శ్రీ చింతల పల్లె వాసు గారు మాట్లాడుతూ, శారీరక వికాసం కొరకు ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయని ,ఆద్యాత్మిక వికాసానికి ఈనెల 12వతేది ఆదివారం ఉదయం 9-30గంటలకు శ్రీ భద్రావతి భావనాఋషి దేవాలయం, నంద్యాల నందు భజన పోటీలు జరుగునని తెలిపారు. స్లో సైక్లింగ్ పోటీలలో 50మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంచేశారు.ఈ పోటీలలో అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ఇలాగే భజన పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు.ముగింపు కార్యక్రమంలో వై.ఎన్. విషువర్ధన్ రెడ్డి ,మనోహర్ జీ ,డా,కె.ఉదయ్ శంకర్ ,డా,శిల్పా మహేశ్వరరెడ్డి , సత్యనారాయణ, అన్నెం శ్రీనివాసరెడ్డి,దండు వెంకటేశ్వర్లు,కె.మనోహర్ నాయుడు ,D.V సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.






