
144views
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు తమిళనాడులో ఊహించని పరిణామం ఎదురైంది. గృహిణులు ఆమెను చుట్టుముట్టి వంట గ్యాస్ ధర తగ్గించాలని కోరారు. 2024 ఎన్నికల దృష్ట్యా ‘వాల్ టూ వాల్’ ప్రచారం ప్రారంభించేందుకు ఆమె కాంచీపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఆ సమయంలో గృహిణులు ఆమెను చుట్టుముట్టి గ్యాస్ ధర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని నిర్మల తెలిపారు. ‘‘మనం వంటగ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి అక్కడ ధర పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది. రెండేళ్లుగా ధర పెద్దగా ఏమీ తగ్గలేదు’’ అని ఆమె వారికి వివరించారు.





