News

2024 నాటికి అమెరికాతో సమానంగా దేశంలో హైవేలు…..కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

183views

దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

భారత్‌మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించనుందని చెప్పారు. “ఈ ఏడాది రూ.16,000 కోట్లతో రైలు వంతెనలను నిర్మించనున్నాం. ఐదేళ్లలో ఆ బడ్జెట్‌ను రూ.50,000 కోట్లకు పెంచుతాం.
పితోర్‌గఢ్‌ మీదుగా కైలాశ్‌ మానస సరోవర్‌కు చేపట్టిన హైవే నిర్మాణం 93 శాతం పూర్తయింది. భారత్‌మాల-2 కింద 5,000 కిలోమీటర్ల హైవేలను తొలుత నిర్మిస్తాం. మొత్తం ఈ ప్రాజెక్టు కింద 35,000 కిలోమీటర్లను నిర్మించాలనేది లక్ష్యం. దీనిద్వారా 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నాం. 600 జిల్లాల మధ్య రాకపోకలపై సాంకేతికంగా అధ్యయనం చేసి కారిడార్లను చేపడుతున్నాం. ఝార్ఖండ్‌లో రూ.70,000 కోట్లతో 7 గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలను నిర్మిస్తున్నాం’ అని గడ్కరీ వెల్లడించారు.