
196views
తిరుమలలో మైహోం గ్రూప్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన మైహోం గ్రూప్ త్రిదండి చినజీయర్ స్వామి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహానికి ‘పద్మప్రియ’గా నామకరణం చేశామన్నారు. అనంతరం జీయర్‌స్వామి తిరుమలలో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న త్రిదండి రామానుజాచార్యుల మఠా(పుష్పమండపం)న్ని ప్రారంభించారు. ఆయన వెంట టీటీడీ ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఉన్నారు.





