News

షిర్డీ సాయిబాబాకు బంగారు కిరీటం

188views

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, ఎ.రంగంపేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయానికి తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కుటుంబ సభ్యులు బంగారు కిరీటాన్ని బహుకరించారు.నాగేంద్ర సతీమణి దానం అనిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయిబాబా మందిరాన్ని సందర్శించారు. ఎంబీయూ వీసీ నాగరాజారామరావు, సీఏ తులసినాయుడు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.