
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం త్రిపురాంతక క్షేత్రంలో ఆదిదేవుడి రథోత్సవం కనుల పండువగా జరిగింది. మూడోవ రోజుసోమవారం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు. రథపూజా కార్యక్రమాన్ని రథ దాతలు గ్రామంలోని గోళ్ల, ఇమ్మడిశెట్టి వంశీయులు నిర్వ హించారు. తహసీల్దారు వి.కిరణ్, ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, ఆలయ చైర్మన్ పి.పద్మజా, ఎంపీపీ సుబ్బారెడ్డి, సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు విశ్వం, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. శివన్నామస్మరణతో రథోత్సవ ప్రాంగణం మార్వోగింది. డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, సీఐ రాంబాబు, ఎస్‌ఐ వెంకటసైదులు ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. అన్ని సంఘాల సత్రాలవారు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు భోజన సౌకర్యాలు కల్పించారు. వైద్యశాఖ ఆద్వర్యంలో శిబిరాలు నిర్వహించారు. స్థానిక జడ్పీ పాఠశాల 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్దులు, త్రినేత్ర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు శీతల పానీయాలను, మజ్జిగను పంపిణీ చేశారు. రథోత్సవం సందర్భంగా చిన్నారులు కోలాటం ప్రదర్శించారు.





