News

అగష్టాతో అష్ట కష్టాలలో కాంగ్రెస్

726views

న్నికల వేళ అగస్టా గండం హస్తం పార్టీని వెంటాడుతోంది. చాపర్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీకి అంతకంతకూ ఉచ్చుబిగుసుకుంటోంది. ఈ కుంభకోణంలో రోజుకో నిందితుడు వెలుగుచూస్తుండటం.. సోనియా అండ్ పార్టీకి ముచ్చెమటటు పట్టిస్తోంది. ఇప్పటికే క్రిస్టియన్ మిషెల్ నుండి సీబీఐ నిజాలు కక్కిస్తుంటే.. తాజాగా వెలుగుచూసిన అగస్టా డైరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో కొత్త పేర్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో లబ్దికోసమే బీజేపీ అగస్టాను వాడుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. అగస్టా కేసులో పాపం పండిందని.. దోషులెవరినీ వదిలపెట్టబోమని కమలనాథులు హెచ్చరిస్తున్నారు. అగస్టా కేసులో దుబాయ్ లో వున్న నిందితులను భారత్ రప్పించి మరీ నిజాలకు కక్కిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి కూపీలాగుతున్నారు. యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన అవినీతి ఆరోపణల్లో అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అగస్టా హెలికాప్టర్ల ఒప్పందంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.