
2017 డిసెంబర్ 31న జమ్ములోని లెథ్‌పొరాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాది నిసార్ అహ్మద్ తాంత్రాయ్‌ను యూఏఈ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. నిసార్‌ను ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చిన ఎన్‌ఐఏ తర్వాత కస్టడీలోకి తీసుకున్నది. కేవలం నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే గల నిసార్‌కు మిడ్‌గెట్ ఉగ్రవాది అన్న పేరు ఉంది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. పుల్వామా జిల్లా అవంతిపొరాలో మరో ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ మాగ్రాయ్ అరెస్ట్‌కు ముందే ఫిబ్రవరి ఒకటో తేదీనే నిసార్ తాంత్రాయ్ యూఏఈకి పారిపోయాడని హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. యూఏఈలో తలదాచుకున్న నిసార్ అహ్మద్ తాంత్రాయ్ అప్పగింత కోసం ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అరెస్ట్ వారంట్ జారీచేశారు. కేంద్రం చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా నిసార్ అహ్మద్ తాంత్రాయ్‌ను యూఏఈ అరెస్ట్‌చేసింది.





