News

ముడిఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం: మోదీ

360views

న్యూఢిల్లీ: దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మనం ప్రస్తుతం 154 మీట్రిక్ టన్నుల ముడి ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతూ, తదుపరి తొమ్మిది, పది సంవత్సరాల లో 300 ఎమ్ టి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలన్నది మన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

గుజరాత్‌లోని హజీరాలో ‘అర్సెలర్‌ మిట్టల్ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ (ఎంఎ/ఎన్‌ఎస్‌- ఇండియా) ప్లాంటు విస్తరణను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభిస్తూ ఉక్కు కర్మాగారం ద్వారా పెట్టుబడులు రావడంతో పాటు అనేక కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటున్నాయని చెప్పారు.

“రూ.60వేల కోట్లకు పైగా పెట్టుబడితో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగ అవకాశాల సృష్టికి వీలు కలుగుతుంది. ఈ విస్తరణ తర్వాత హజీరా స్టీల్ ప్లాంట్‌లో ముడి ఉక్కు ఉత్పాదక సామర్థ్యం 9 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెరుగుతుంది” అని ఆయన తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి