News

కేరళలో యెన్.డి.ఏ మహిళా పార్లమెంట్ అభ్యర్ధికి అవమానం.

840views

కేరళలోని పొన్నని పార్లమెంట్ యెన్.డి.ఏ అభ్యర్ధి, అధ్యాపకురాలిగా మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రొఫెసర్ వి.టి. రమ తుంజ తెజుతచ్చన్ లోని మలయాళం సర్వకళాశాలలో ఎన్నికల ప్రచారం కోసం తగిన అనుమతులు పొందారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారం నిమిత్తం కళాశాలకు వెళ్లి ప్రచారం కొనసాగించారు. అన్ని విభాగాలలోని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమె కళాశాలలోని గ్రంథాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ కూర్చుని వున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమ్మద్ రఫీ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరుష పదజాలంతో దూషిస్తూ ఆ గదిలో నుంచి వెళ్లవలసినదిగా ఆమెపై పెద్దగా కేకలు వేశారు.

దీనిపై ఆగ్రహించిన యెన్.డి.ఏ వర్గాలు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. కళాశాల యాజమాన్యం వివరణ కోరిన అనంతరం ప్రొఫెసర్ రఫీ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. జనం టీవీ వేదికగా దీనిపై యెన్.డి.ఏ అభ్యర్ధి ప్రొఫెసర్ రమను క్షమాపణ కోరిన రఫీ తాను ఎక్కడికైనా వచ్చి ఆమెను క్షమాపణ కోరుతానని వెల్లడించారు. కాగా జరిగిన ఘటనపై యెన్.డి.ఏ ఎలక్షన్ కన్వీనర్ ఎలక్షన్ కమీషన్ కు, గవర్నర్కు ఫిర్యాదు చేశారు.