
జార్ఖండ్: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలోని 33 ప్రభుత్వ పాఠశాలలకు ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికారుల నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్కడ పాఠశాల యాజమాన్యాలు శుక్రవారం పాఠశాలలకు హాలిడే ప్రకటించారు. ఆ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదిక కోరగా, విచారణ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వస్థలం దుమ్కా కావడంతో ఇతర సామాజిక వర్గాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దుమ్కాలోని షికారిపరా బ్లాక్‌లోని పది, రాణిశ్వర్ బ్లాక్‌లోని ఎనిమిది, సరయ్యహత్ బ్లాక్‌లోని ఏడు, జామా బ్లాక్, జర్ముండి బ్లాక్‌లోని రెండు, కతికుండ్ బ్లాక్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం సెలవులు ఇచ్చారు. చాలా వరకు పాఠశాలలు ఉర్దూ పాఠశాలలు కావడంతో శుక్రవారం సెలవు దినాన్ని ప్రకటించారు.
Source: NationalistHub





