
బెంగళూరు: బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా స్కూల్ గర్ల్స్ కొట్టుకున్నారు. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగుకున్నారు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కర్రతో కొట్టింది. మెట్ల వద్ద కూడా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చేశారు. సెయింట్ మార్క్స్ రోడ్డులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి.. మొదట గొడవను ఆపడానికి అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించినా కూడా వీలు పడలేదు.
రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరితో ఒకరు కొట్టుకున్నారు. కొందరు పాఠశాల యూనిఫారం ధరించి ఉండగా, ఇంకొందరు సాధారణ దుస్తులు ధరించారు. సోషల్ మీడియా ఈ వీడియో వైరల్ అయింది. వినియోగదారులు చెబుతున్నదాన్ని బట్టి.. ఈ గొడవలో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి బెంగళూరులోని ప్రసిద్ధ బిషప్ కాటన్ బాలికల పాఠశాల అని తెలిపారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం తెలిసిరాలేదు. గొడవకు సంబంధించిన కారణం కూడా తెలియరాలేదు. ఘటనా స్థలంలో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు.
Source: NationalistHub





