
564views
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం హనుమాన్ ఆలయంలో చాలీసా పఠించారు.
ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించడంతో కౌర్ దంపతులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో చాలీసా పటించడంతో శివసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





