
560views
వివిధ సంస్కృతీ సంప్రదాయాలకు, విభిన్నతకు, వైవిధ్యానికి ఆలవాలమైన మనదేశంలో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే వివాహాది కార్యక్రమాలలో సైతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారాలు అమలవుతూ ఉంటాయి.
అలాగే కర్నూలు జిల్లా సంతే కుండ్లూరు గ్రామంలో హోళీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో ఈరోజున మగవాళ్లు అందరూ.. ఆడ వేషం ధరించి రతీ మన్మథులను పూజిస్తారు. చీర కట్టుకుని, పూలు, నగలు అలంకరించుకుని అచ్చం ఆడవారిలాగా రెడీ అవుతారు. ఇలా ఆడవేషధారణలో పూజించడం వల్ల కోరికలు తీరుతాయని, పంటలు బాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం. ఈ వేడుకను చూసేందుకు ఏటా చాలామంది సందర్శకులు కూడా ఆ గ్రామానికి వస్తారు.





