
956views
వీర సావార్కర్.. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసాడు. ఈ భారతమాతకు స్వేచ్ఛను అందించాలని తన చివరిశ్వాస వరకూ పోరాడిన యుగపురుషుడు సావార్కర్. అటువంటి మహానుభావుడిని ఓ పిరికిపందగా వర్ణించాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ వీర సావార్కర్ ను ఒక పిరికిపందగా అభివర్ణించాడు. దీంతో రాహుల్ గాంధీ మీద కేసు నమోదు చేశారు. పూణేలో రాహుల్ గాంధీ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్ లో కూడా రాహుల్ వీర సావర్కర్ పై పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సావార్కర్ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు పోలీసులను ఆశ్రయించారు. సావార్కర్ ను అవమానించినందుకు రాహుల్ గాంధీ తగిన మూల్యం చెల్లించకతప్పదని సావార్కర్ కుటుంబ సభ్యులు అంటున్నారు.
Source : Bharath Today
https://www.bhaarattoday.com/news/national/story/30711.html





