
664views
-
అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిక
గ్లాస్గో: భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సులో భాగంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కెర్రీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని మరింత వేగంగా విస్తరించడానికి ఇది ఒక ముఖ్యమైన సహకారమని అన్నారు. అంతర్జాతీయ సౌర కూటమిలో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో భాగంగా అమెరికా తీసుకున్న నిర్ణయం కూటమిని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





