News

పశ్చిమ కృష్ణ జిల్లా కార్యవాహ శ్రీ సుధాకర్ అస్తమయం

497views

ర్ ఎస్ ఎస్ పశ్చిమ కృష్ణా జిల్లా (18 రెవెన్యూ మండలాలతో కూడిన పశ్చిమ కృష్ణ ప్రాంతాన్ని ఆర్ ఎస్ ఎస్ లో పశ్చిమ కృష్ణ జిల్లాగా వ్యవహరిస్తారు.) కార్యవాహ శ్రీ పర్వతం సుధాకర్ (48) ఈరోజు (2/1/2021) ఉదయం 10 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు.

స్వర్గీయ సుధాకర్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. వివాహానంతరం వారు విజయవాడలో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కొద్దికాలం అధ్యాపకులుగా పనిచేశారు. అనంతరం హైదరాబాదులో లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం విజయవాడలోనే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే విద్యా సంస్థను ప్రారంభించి కొనసాగిస్తున్నారు.

 

పూర్తి సమయ కార్యకర్త వలే అత్యధిక సమయాన్ని ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలకే వెచ్చించే శ్రీ సుధాకర్ మృతి పశ్చిమ కృష్ణ ప్రాంతంలో ఆర్ ఎస్ ఎస్ కు తీరనిలోటు అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప స్నేహశీలి, మృదు స్వభావి, గొప్ప నిబద్ధత కలిగిన కార్యకర్త అయిన శ్రీ సుధాకర్ మృతి వార్త తెలిసిన కార్యకర్తలెందరో కన్నీరు మున్నీరవుతున్నారు.
స్వర్గీయ సుధాకర్ రాత్రి రామజన్మభూమి నిధి సేకరణ కోసం జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఉదయం నిద్ర లేచాక కూడా వారు ఆ పని గురించే కొంత మంది కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం 10 గంటల సమయంలో హఠాత్తుగా గుండెనొప్పితో బాధ పడ్డారు. వారి అర్ధాంగి ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్ కి తరలించే లోపే ప్రాణాలు విడిచారు. శ్రీ సుధాకర్ దంపతులకు సంతానం లేరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.