News

ఆలయాలపై దాడులు దేశానికి నష్టం: చినజీయర్‌ స్వామి

713views

లయాలపై ఎవరు దాడులు చేసినా తప్పేనని, అలాంటి వాళ్లను ప్రభుత్వం అణచివేయాలని త్రిదండి చినజీయర్‌ స్వామి కోరారు. దేవాలయ సంపదను ఎవరు నాశనం చేసినా జాతికి, దేశానికి నష్టమేనన్నారు. బుధవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళ్లిన ఆయన ఇటీవలి కాలంలో ఏపీలో పలు ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పైవిధంగా స్పందించారు. ఆలయానికి విచ్చేసిన చినజీయర్‌కు ఈవో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌ మాట్లాడుతూ భక్తుల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.