
ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలలో 351 మండలాలలో సమరసత సేవా ఫౌండేషన్ పని జరుగుతున్నది.
1) 5 ఏప్రిల్ న శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతి 230 మండలాలలో 559 స్థలాలలో జరుగగా 7,119 మంది కార్యక్రమాలలో పాల్గొన్నారు.14,021 మందికి వాట్స్ యాప్ ద్వారా సందేశం పంపబడింది.
2) ఏప్రిల్ 11 న మహాత్మా జ్యోతి బా ఫూలే జయంతి 280 మండలాలలో 972 చోట్ల జరుగగా 11,876 మంది పాల్గొనగా 20,361 మందికి WhatsApp ద్వారా వీరి జీవన సందేశం పంపారు.
3) 14 ఏప్రిల్ డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా 317 మండలాలో గరిష్టంగా 1923 స్థలాలు,ఇండ్లలో కార్యక్రమాలు జరగగా 31,157 మంది పాల్గొన్నారు. వాట్సాప్ ద్వారా సందేశం 24,769 మందికి పంపబడింది.విగ్రహాలు ఉన్న చోట్ల విగ్రహాలకు పూలమాలలు వేశారు.లేనిచోట ఇండ్లలో కార్యక్రమాలను నిర్వహించారు. అన్ని విభాగాల్లో ఉన్న కార్యకర్తలకు సమతా మూర్తుల జీవిత విషయాలపై, ప్రశ్నలను ఇచ్చి సమాధానాలను కోరారు.
డా.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పలుచోట్ల పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు.
కరోనా లాకౌట్ సందర్భంగా పేద ప్రజలకు ఆహార పొట్లాలు, శానిటైజర్లు, నిత్య అవసర సరుకులు అందచేశారు. సమతామూర్తుల జయంతి పేరుతో వాళ్ళ జీవిత సందేశాన్ని వేలాది మందిచే చదివించే ప్రయత్నం జరిగింది. మండల స్థాయిలో Sc, St హక్కుల సంక్షేమ వేదిక ఏర్పడినది. సమతాత్రయం జయంతి ఉత్సవాలు నిర్వహించడంతో వీరిలో క్రియాశీలత పెరిగి ఉత్సాహంగా పని చేస్తున్నారు.