
705views
‘తబ్లీగీ జమాత్’ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కాంధ్వలీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా బారినపడి పలువురు మృతి చెందడానికి కారకులయ్యారని పోలీసులు పేర్కొన్నారు. నిజాముద్దీన్ ఠాణా హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కాంధ్వలీపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 304 కింద; విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపై వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశామన్నారు.