News

చౌరీ చౌరా ఉద్యమంలో శిక్ష పడినవారిని కాపాడని నెహ్రూ

6views

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన చౌరీ చౌరా ఉద్యమంలో మరణ శిక్షలు పడిన వారిని కాపాడటంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విఫలమయ్యారని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. చౌరీ చౌరా నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నిరసనకారులు ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టి పలువురు పోలీసుల మృతికి కారకులు కావడంతో 172 మందికి బ్రిటష్‌ సర్కారు మరణ దండన విధించిందని గుర్తు చేశారు. ‘‘నెహ్రూ ఎంతో గొప్ప లాయర్‌ అని కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెబుతుంటారు. వాస్తవం ఏమిటంటే వీరిని కాపాడేందుకు ఆయన ముందుకు రాలేదు. మదన్‌ మోహన్‌ మాలవీయ మాత్రం చట్టపరమైన వాదనలతో 151 మందిని ఉరికంబం నుంచి కాపాడారు. అందుకే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న పురస్కారమిచ్చి గౌరవం చాటుకున్నారు. చౌరీ చౌరాలో ప్రాణత్యాగం చేసిన వీరులు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక అధ్యాయంగా నిలిచారు. ఆనాటి కాంగ్రెస్‌ నాయకత్వంపైనా అది ప్రభావం చూపింది’’ అని తెలిపారు.