News

కోవిడ్ -19పై వదంతులు వ్యాప్తి చేసినందుకు అస్సాంలో ఎమ్మెల్యే అరెస్టు

1.2kviews

రోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మరియు రోగుల చికిత్సపై రెచ్చగొట్టే, మతపరమైన తప్పుడు ప్రకటనలు చేసినందుకు అస్సాంలో ప్రతిపక్ష శాసనసభ్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

అఖిల భారత యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్) కు చెందిన ధింగ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నేరపూరిత కుట్ర, కొన్ని వర్గాల మధ్య అసంతృప్తిని వ్యాప్తి చేసిన ఆరోపణలపై అరెస్టు చేసినట్లుగా అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) భాస్కర్ జ్యోతి మహంత తెలిపారు.

సోషల్ మీడియాలో అమీనుల్ ఇస్లాం వెలువరించిన ఆడియో క్లిప్లలో, ఇస్లాం కోవిడ్ -19 సాకుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకునే కుట్ర ఉందని, నిర్బంధానికి పంపిన వారిని చంపే అవకాశం ఉన్నదని అన్నారు.

పోలీసులు సోమవారం రాత్రి నాగావ్ జిల్లాలోని ధింగ్‌లోని తన నివాసం నుంచి ఇస్లాంను తీసుకెళ్ళి విచారణ అనంతరం మంగళవారం ఉదయం అరెస్టు చేశారు.

Source : Hindusthan Times

https://www.hindustantimes.com/india-news/assam-mla-held-for-spreading-false-covid-19-info-police/story-chZkNRC5WHm6GF5eM1fkoM.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.