
ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ మసీదులో తలదాచుకున్న పలువురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కూడా వందలమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కొంత మంది మలేషియాకు చెందిన వ్యక్తులు రహస్యంగా హైదరాబాద్ నగరంలోని మసీదులో తలదాచుకున్నారు.
ఐబీ సమాచారంతో విదేశీయుల అరెస్ట్..
ఇంటెలీజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని.. రహస్యంగా దాక్కున్న ఆరుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేశారు. నిందితుల్లో హమీద్ బిన్ జేహెచ్ గుజ్లీ, జహ్ రాతులామనీ, వరాహ్మద్ అల్ బక్రీ బిన్వాన్, ఏబీడీ మనాన్ జమాహ్ బిన్టీ అహ్మద్, ఖైరిలీ అన్వర్ బన్ అబ్దుల్ రహీం, జైనారియాల్ బిన్డీ ఎండీ నూర్ ఉన్నారు.
గాంధీ ఆస్పత్రికి తరలింపు…
మలేషియాకు చెందిన వీరంతా పర్యాటక వీసాలపై భారతదేశానికి వచ్చి నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్ సమీపంలోని హకీంపేటలో ఓ మసీదులో తలదాచుకుంటున్నారు. ఐబీ సమాచారంతో ఆదివారం వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వారి రిపోర్టులు వస్తేగానీ వారికి కరోనా ఉందా? లేదా? అనే విషయం వెల్లడవుతుంది.
Source : One India Telugu