News

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర్

0views

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై ఆసక్తి.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర

న్యూయార్క్‌లో ఆగస్టు 29న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమంపై చర్చ జరుగుతోంది. ప్రముఖ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని తెలిపారు.

ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేయడం విషయంలో నగర అధికారాలపై స్పష్టత లేదని మేయర్ వ్యాఖ్యానించడం ద్వారా, కార్యక్రమం కొనసాగేందుకు చట్టపరమైన అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అయితే, ఈ కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వబోనని మామ్దాని చెప్పారు. భారతీయ అమెరికన్‌గా తనకు భారతదేశం బహుళత్వం, లౌకిక విలువలకు ప్రతీకగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, భారతీయ సంస్కృతి, దేశభక్తి, సామాజిక సేవ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థగా  కార్యకర్తలు పేర్కొంటున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న కార్యక్రమం ద్వారా భారతీయ సమాజంతో సంభాషణకు అవకాశం లభిస్తుందని ఆ సంస్థకు అనుకూల వర్గాలు భావిస్తున్నాయి.

కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు అభిప్రాయ భేదాలతో సంబంధం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశం ఉండాలని  పలు వర్గాలు చెబుతున్నాయి.