
937views
ఈ సంవత్సరం హోళీ పర్వదినాన్ని ముంబయిలోని వర్లీ ప్రాంత వాసులు వినూత్నంగా జరుపుకొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీ రోజు సాయంత్రం ‘హోళికా దహనం’ జరపటం సంప్రదాయం. ఈ సందర్భంగా ముంబయి వాసులు కరోనావైరస్ భారీ దిష్టిబొమ్మను తయారుచేసి దానికి ‘కరోనాసురుడు’ అనే పేరు కూడా పెట్టారు. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్ దిష్టి బొమ్మకు వారు నిప్పంటించారు. వ్యాక్సిన్‌తో కరోనా భూతాన్ని అంతమొందిస్తామనే అర్థం వచ్చేలా టీకాను పోలిన బొమ్మతో కరోనాసురుడికి నిప్పు పెట్టి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.





