NewsProgramms

అలుపెరగని కళాయోధుడు – శ్రీ వాకంకర్

610views

లిత కళల ద్వారా సాంస్కృతిక ప్రేరణ, సంస్కృతిని పరిరక్షించడం, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గత 38 సంవత్సరాలుగా పని చేస్తున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి.

వ్యక్తి మరియు సమాజ నిర్మాణానికి విలువ ఆధారిత కళల ద్వారా సంస్కార భారతి కృషి చేస్తున్నది. ప్రాచీన కళకు ఆధునికతను అనుసంధానం చేస్తూ క్రొత్త ప్రయోగాల ద్వారా , నైపుణ్యం గల నేటి యువతను ప్రేరేపించడంలో సంస్కార భారతి కీలక పాత్ర పోషిస్తున్నది.

భారత దేశ సాంస్కృతిక వారసత్వ భావనను ప్రజలలో  పెంపొందించడంలో సంస్కార భారతి వినూత్న ప్రయోగాలు, కార్యక్రమాలు చేపడుతున్నది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మరియు సాంస్కృతిక సాధకుడు అయిన డాక్టర్ విష్ణు శ్రీధర వాకన్ కర్ యొక్క శతజయంతి సంవత్సరాన్ని యావత్ భారత దేశంలో జరపాలని సంస్కార భారతి ప్రయత్నం చేస్తున్నది.

1/3/2020 ఆదివారం విజయవాడలో శ్రీ వాకంకర్ జీ శతజయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతి రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ వాకంకర్ జీవన ఆదర్శాన్ని వర్ణిస్తూ శ్రీ శ్రీనివాస్ రచించిన గీతాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ  కుమార సూర్య నారాయణ ఆలపిస్తున్న సమయంలో ఆ గీతాలాపన పూర్తయ్యేలోగానే శ్రీ వాకంకర్ జీ చిత్రాన్ని గీసిన   ప్రముఖ చిత్రకారులు, సంస్కార భారతి రాష్ట్ర చిత్రలేఖన ప్రముఖ్ శ్రీ అల్లు రాంబాబు గారి అద్భుత ప్రతిభ ఆహూతులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

శ్రీ వాకంకర్ జీ  గురించి సంక్షిప్తంగా…..

పద్మశ్రీ పురస్కార గ్రహీత,

డాక్టర్ విష్ణు శ్రీధర వాకన్ కర్, నీమచ్, మధ్య ప్రదేశ్.

# 2003 వ సంవత్సరం లో యునెస్కో గుర్తింపు పొందిన భీమ్ బెడ్కా గుహలు (మధ్య ప్రదేశ్) కనుగొనడం#, సరస్వతీ నది కోసం చేసిన అన్వేషణ # ఆయన చేపట్టిన ప్రముఖ కార్యక్రమాలు.

*మే 4 వ తేది ,1919 వ సంవత్సరం మధ్య ప్రదేశ్ లోని నీమచ్ పట్ట ణంలో జన్మించారు.

* ఎమ్ ఎ, పిహెచ్ డి, జి డి ఆర్ట్స్ లో ఉత్తీర్ణులు.

* విక్రమ్ యూనివర్సిటీ, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ లోని పురావస్తు ప్రదర్శనశాల పథ నిర్దేశకులు.

* సంస్కార భారతి, అఖిల భారత ప్రధాన కార్యదర్శి, * భారతీయ కళాభవన్, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ సంస్ధాపక సంయోజకులు

*లలిత కళా అకాడమీ, రాక్ పెయింటింగ్ పరిశోధనా సంస్థల, సంయోజకులు.

*ఆర్ యస్ యస్, మధ్య భారత్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్,

* చంబల్ మరియు నర్మదా నదీ బేసిన్, సరస్వతీ నది, అసోం దక్షిణ భారత దేశంలో పురావస్తు శాస్త్ర పరిశోధన, సర్వేక్షణ.

*భారత రాష్ట్రపతి చే 1975లో పద్మశ్రీ పురస్కారం స్వీకారం

* వారి ప్రచురణలు: ఇండియన్ రాక్ పెయింటింగ్, మై ఆర్కియలాజికల్ ఎక్స్ ప్లొరేషన్, ప్రాచీన చిత్ర కళ, పురాతత్వ, ముద్రాశాస్త్ర, ఎన్నో పరిశోధన పత్రాలు * ఫ్రాన్స్, యూరప్, అమెరికా, ఇటలీ వంటి దేశాలలో పరిశోధన,

* సింగపూర్ లో ఏప్రిల్ 3 వతేదీ ,1988 సంవత్సరం లో పరిశోధన పత్రం సమర్పణ తరువాత, అక్కడే తుదిశ్వాస విడిచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.