News

ఆరోగ్యంలో తినే విధానం, వంట పాత్రలు కీలకమే

61views

ఆహారాన్ని వండుకుని భుజించే విధానంతో పాటు వంటకు ఉపయోగించే పాత్రలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల ఆవరణలో జరుగుతున్న శబల భోజన పండగలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ రామ్, జీవన విద్య శివ శంకర్, మిల్లెట్ రాంబాబు ప్రకృతి పంటలు, వంట పాత్రలు, ఆహారాన్ని భుజించే విధానాలపై ఔత్సాహికులకు అవగాహన కల్పించారు. భోజన పండగల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద రద్దీ కనిపించింది. అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా తిలకించారు.