
59views
తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సామూహిక ప్రకృతి వ్యవసాయo, ఏపీ రైతు సాధికారిక సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభమైన మూడు రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఎల్ నీనో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, దాని ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొనే, రసాయన ఎరువులు లేని, తక్కువ పెట్టుబడి గల ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఖరీఫ్ కు ముందే రైతుల వద్దకు చేర్చాలని తెలిపారు.





