News

దేవాలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే

82views

రాజకీయ నాయకుల ప్రమేయంవల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యా క్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు.

అనకాపల్లిలోని స్థానిక వివేకానంద పంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్- హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన కార్యక్రమం వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ నాయకుల పెత్తనం ఉండరాదని, హిందూ దేవాలయాల భూములను కాపాడవలసిన బాధ్యత హిందువులపై ఉందన్నారు.

కార్యక్రమంలో స్వామీ జీలు నరసింహాచారి, రాళ్లపల్లి పాపీశర్మ, డాక్టర్ విష్ణుమూర్తి, వీహెచ్సీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపేటి రామకొండలరావు, కటకం లక్ష్మణరావు, సహా కార్యదర్శి పీలా హేమ జగదీష్ నాయుడు, కోశాధికారి రమేష్, అనకాపల్లి అధ్యక్షుడు నుదు రుపాటి తాతాజీ, ప్రాంత తొలి సభ్యుడు శ్రీకాళ హస్తి పాల్గొన్నారు.