News

ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభం

199views

వైయస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద టిటిడి ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్‌, కలెక్టర్‌, ఎస్పీలు భక్తులకు భోజనం వడ్డించారు. గతేడాది రాములవారి కల్యాణానికి సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా.. తితిదే తరహాలో ఇక్కడ కూడా నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని తితిదే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మరో వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో టిటిడి అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. మరోవైపు ఏప్రిల్‌ 1న జరగబోయే ఒంటిమిట్ట సీతారామ కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్‌ తెలిపారు.