News

తెలంగాణ అసెంబ్లీలో ‘వందేమాతరం’ : ఎంఐఎం వాకౌట్..

96views

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేళ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభ ప్రారంభంలో ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ) పార్టీ ఎమ్మెల్యేలు సభ నుండి బయటకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్యను భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సభా సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. స్పీకర్ స్థానంలో ఉన్న వారు గీతాలాపన ప్రారంభించాల్సిందిగా సూచించగానే, ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ సీట్ల నుండి లేచి సభ వెలుపలికి వెళ్లారు. గీతాలాపన పూర్తయిన తర్వాత తిరిగి సభలోకి ప్రవేశించారు.

బీజేపీ ఎమ్మెల్యేల నిప్పులు..

ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ శాసనసభాపక్షం నిప్పులు చెరిగింది. సభలో వందేమాతరం పాడుతుంటే గౌరవించకుండా బయటకు వెళ్లడం దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. వందేమాతరం వినడానికి ఆసక్తి లేకనా, లేదంటే సదరు సభ్యులకు దేశ భక్తి లేదా? అని ప్రశ్నించారు. వందేమాతరం గీతాన్ని అవమాన పర్చిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అసలు వీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? వీరు అసలు ఈ దేశ పౌరులేనా?” అని బీజేపీ ఎమ్మెల్యేలు ఘాటుగా ప్రశ్నించారు. జాతీయ భావాలను గౌరవించలేని వారు ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అర్హతను కోల్పోతారని, ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.