News

పోలీస్ స్టేషన్ పై దాడి.. 47 మంది ముస్లింలపై కేసులు

126views

మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలోని మోఘాట్ పోలీస్ స్టేషన్ పై ముస్లిం ఛాందసులు మూకదాడి చేశారు. అంతేకాకుండా రాళ్లు కూడా రువ్వారు. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో ముస్లింలు పీఎస్ వద్దకు చేరుకొని, స్టేషన్ ను చుట్టుముట్టి, దాడికి దిగారు.

ప్రవక్త ముహమ్మద్ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వచ్చాయని ముజాహిదీన్ ఖురేషీ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడానికి పీఎస్ కి వెళ్లాడు. కొద్ది సేపటికే ముస్లింలు పీఎస్ దగ్గర భారీ సంఖ్యలో గుమిగూడారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, ఆ గుంపు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద గొడవ జరిగింది. ఆ గుంపులోని కొంతమంది పోలీస్ అధికారి కాలర్ పట్టుకొని, స్టేషన్ లో వున్న ఇతర సిబ్బందిని తోసేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు.. అదనపు బలగాలను రప్పించి, చెదరగొట్టడానికి లాఠీఛార్జీ చేశారు. పుకార్లను నమ్మవద్దని, సంయమనంతో వుండాలని కూడా పోలీసులు కోరారు. అయినా సరే పరిస్థితి అదుపులోకి రాలేదు.

మరో వైపు పోలీసులు పీఎస్ పై దాడి చేసినందుకు, మొత్తం 47 మందిపై కేసులు పెట్టారు.దీనిపై స్థానిక డీఎస్పీ స్పందించారు. “సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. దీంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. తాము కూడా కేసు నమోదు చేశాం. నిందితుడ్ని అరెస్ట్ కూడా చేశాం. అయినా కొంత మంది నిరసనకారులు పీఎస్ ఆవరణలో గుమిగూడి దుర్మార్గంగా వ్యవహరించారు. అసంబద్ధమైన డిమాండ్లు కూడా చేశారు. పుకార్లను నమ్మవద్దని మేము కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

ఆ గుంపులో భాగమైన కొంతమంది ముస్లింలు ఆ ప్రాంతం గుండా వెళుతున్న ఒక మహిళపై కూడా దాడి చేశారు.. ఆ గుంపులోని దాదాపు 8-10 మంది వ్యక్తులు ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించి, శారీరకంగా దాడి చేశారు.దీంతో ఆ మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.