
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) ప్రాంగణం ఏయూ మెయిన్ గేటు వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల చోటుచేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంపై ధర్నా చేస్తూ వారు బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చేసిన నినాదాలు ప్రాంగణమంతా మారుమోగాయి.
నిరసన తీవ్రత పెరగడంతో, రహదారిపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. పోలీసులకు, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో వర్సిటీ గేటు వద్ద స్వల్ప గందరగోళం నెలకొంది.





