GalleryNewsProgramms

రాష్ట్రమంతటా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల వికాస శిబిరాలు

1.03Kviews

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ జిల్లాలలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాలలో మండల పై స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విభాగ్ శిబిరాల చిత్ర మాలిక మా VSK పాఠకుల కోసం

విజయనగరం విభాగ్ :

విజయనగరం విభాగ్ శిబిరము శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల నందు జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 226 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్ఘాటన లో మాట్లాడుతున్న ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ శ్రీ జనార్ధన్

సమరోప్ లో వేదిక మీద ఆశీనులైనవారు మాననీయ విభాగ్ సంఘచాలక్ డా.DVV కృష్ణంరాజు గారు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC శ్రీ పి.రఘురాజు గారు, ప్రాంత సహ సేవా ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి.

బైఠక్ తీసుకొంటున్న క్షేత్ర సహ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ గోవిందా జీ

** శిబిరంలో షుమారు 180 మంది నియుద్ధ ప్రదర్శన చేశారు.
సూర్యనామస్కారాలు, నియుద్ధ, బస్కీలు, దండీల పోటీలు జరిగాయి.

విశాఖ విభాగ్ :

99 సంఘ మండలాలకు గాను 45 సంఘ మండలాల నుండి శిబిరంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో శ్రీ జనార్దన్ గారు (సంభాఘ్ ప్రచారక్) డా” విజయ గోపాల్ గారు (విభాగ్ సంఘచాలక్ లు) పాల్గొని మార్గ దర్శనం చేశారు.

సమారోప్ లో ప్రసంగిస్తున్న సంభాగ్ ప్రచారక్ శ్రీ జనార్ధన్

రాజమండ్రి విభాగ్ :

రాజమహేంద్రవరం విభాగ్ శిబిరం కొండగట్టులోని గైట్ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 213 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి వ్యవస్థ చెయ్యడంలో 75 మంది ప్రబంధకులు పని చేశారు.

సార్వజనికోత్సవంలో ప్రాంత సంఘచాలక్ శ్రీనివాస రాజు, విభాగ్ సంఘచాలక్ శ్రీ సుబ్బరాజు, శిబిర కార్యవాహ శ్రీ రామారావు

విజయవాడ విభాగ్ :

విజయవాడ విభాగ్ శిబిరం నూతక్కిలోని విజ్ఞాన విహార ఆవాస విద్యాలయంలో జరిగింది. ఇందులో 96 మంది పాల్గొన్నారు.

వేదికపైన మాననీయ ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాసరాజు, విభాగ్ సంఘచాలక్ శ్రీ నార్ల వినయ్ కుమార్, శిబిరాధికారి

శ్రీ కోనేరు బలరామ్

గుంటూరు విభాగ్ :

గుంటూరు విభాగ్ శిబిరం గుంటూరు సమీపంలోని లాం గ్రామంలో గల చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 153 మంది పాల్గొన్నారు.

వేదికపై ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్, మాననీయ విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ KSN చారి, వర్గాధికారి

శ్రీ చలువాది వెంకటేశ్వర్లు, ముఖ్యఅతిథి శ్రీ మిట్టపల్లి రమేష్.

ఒంగోలు విభాగ్ :

ఒంగోలు విభాగ్ మండలస్థాయి కార్యకర్తల శిబిరం 2రోజుల పాటు కందుకూరు నగరంలోని ఆక్సఫోర్డ్ స్కూల్లో జరిగింది. మొత్తం 22 మండలాల నుండి 130 మంది కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందటం జరిగింది.మొదటి రోజు RSS సహ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య గారు, రెండవరోజు ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు గారు శిబిరంలో ఉండటం జరిగింది.కార్యక్రమంలో భాగముగా పుర ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించగా 150 మంది పాల్గొన్నారు. జాతీయ సాహిత్య విక్రయం జరిగింది.

ప్రసంగిస్తున్న ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు

సంఘస్థాన్

జాతీయ సాహిత్య విక్రయం

నెల్లూరు విభాగ్ :

నెల్లూరు విభాగ్ శిబిరం గూడూరు సమీపంలోని శ్రీ నారాయణ ఇంజినీరింగ్ కాలేజి నందు జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 288 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్ఘాటన కార్యక్రమంలో ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పాల్గొని ప్రసంగించారు. మొదటి రోజు బౌద్ధిక్ కార్యక్రమంలో క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం కుమార్ ప్రసంగించారు. ముగింపు కార్యక్రమం సమారోప్ లో సహ ప్రాంత కార్యవాహ శ్రీ దువ్వూరు యుగంధర్ పాల్గొని ప్రసంగించారు.

ఇతర ప్రాంత అధికారులు ప్రాంత సామాజిక సమరసత శ్రీ కోడూరి సత్యం గారు, మాననీయ విభాగ్ సంఘచాలక్ మరియు ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యలు పాల్గొన్నారు.

తిరుపతి విభాగ్ :

తిరుపతి విభాగ్ శిబిర ఉద్ఘాటనలో మాట్లాడుతున్న ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ గారు, వారి పక్కన విభాగ్ కార్యవాహ

శ్రీ రాజేంద్ర గారు. 157 మంది పాల్గొన్నారు.

అనంతపురం విభాగ్ :

అనంతపురం విభాగ్ శిబిరంలో 235 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర కార్యవాహ శ్రీ తిప్పే స్వామి, ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల నాయుడు, విభాగ్ సంఘ చాలక్ శ్రీ కాకర్ల రంగయ్య పాల్గొన్నారు.

శిబిరం సమారోప్ కార్యక్రమంలో ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, మాననీయ విభాగ్ సంఘ చాలక్ శ్రీ కాకర్ల రంగయ్య పాల్గొని మార్గదర్శనం చేశారు.

కర్నూలు విభాగ్ : 

కర్నూలు విభాగ్ శిబిరంలో 108 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్ఘాటనలో సహ ప్రాంత కార్యవాహ శ్రీ యుగంధర్ గారు, సమారోప్ లో క్షేత్ర కార్యవాహ శ్రీ తిప్పేస్వామి గారు మార్గదర్శనం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.