
59views
అక్రమ మసీదులకు అంతేలేదు. అధికారులు అనుమతులు ఇవ్వకున్నా.. రాత్రికి రాత్రే ఛాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణాన్ని చేపట్టేస్తున్నారు. విపరీతమైన విస్తరణ కాంక్ష వైపు వెళ్తున్నారు. మొదట ఓ చిన్న నిర్మాణం లాగా చేసుకొని, ఆ తర్వాత తర్వాత పెద్ద పెద్ద బహుళ అంతస్థుల్లో అక్రమంగా మసీదుల నిర్మాణం చేసేస్తున్నారు. ఆయా విభాగాల దగ్గర అనుమతులు తీసుకునే క్రమంలో ఒక్కోసారి నివసించడానికి ఇల్లు అని చెప్పి, కొన్ని రోజుల తర్వాత అదే ఇంటి స్థలంలో అక్రమంగా మసీదును కూడా నిర్మించేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా హిందువులు భారీ నిరసనలే చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వాల్లో కొంత కదలిక వచ్చి, వాటిని కూల్చేస్తున్నా… ఛాందసులు మాత్రం అక్రమ మసీదుల నిర్మాణాన్ని చేపడుతూనే వున్నారు. తాజాగా కర్నాటకలో ఆల్మట్టి డ్యాం నిర్వాసితుల నివాసం కోసం కేటాయించిన స్థలంలోనే అక్రమ మసీదు నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ మసీదుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలాంటివి కొన్ని ఉదాహరణలను ఒకసారి పరిశీలిద్దాం.
కర్నాటకలోని బాగల్ కోట్ నవనగర్ ప్రాంతంలోని ఆల్మట్టి డ్యామ్ నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించి నివాస స్థలాల్లో అనధికారికంగా మసీదుల నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రోజు రోజుకీ ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనకు దిగారు. నిర్వాసితులమైన తమకు నివాసం కోసం కేటాయించిన స్థలంలో మతపరమైన నిర్మాణాలు చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నారని మండపడ్డారు. దీంతో సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరుగుతాయని అన్నారు.
అల్మట్టి జలాశయం నిర్మాణ కారణంగా తమ ఇళ్లు, భూములు మరియు పూర్వీకుల ఆస్తులను కోల్పోయిన వేలాది కుటుంబాల కోసం నవనగర్ ఒక ఆదర్శ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టు పేరుతో ప్రజలు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని, తమ జీవితాలు సురక్షితంగా వుంటాయని ప్రభుత్వాలు చెప్పడంతోనే ఇక్కడికి వచ్చామని నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఇక్కడ తమకు కేటాయించిన పరిమితమైన నివాస స్థలాన్ని కూడా ఛాందసులు మార్చేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.
ఇళ్ల కోసం కేటాయించిన ప్లాట్లను అధిక ధరలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని తాత్కాలిక మతపరమైన కట్టడాలుగా మారుస్తున్నామని నిర్వాసితులు పేర్కొంటున్నారు. మొదట రేకుల షెడ్డును నిర్మిస్తారని, కొన్ని నెలల లోపే దానిని మసీదుగా నిర్మించేస్తారని పేర్కొంటున్నారు. నవనగర్ లోని పలు సెక్టార్లలో ఇదే పని నడుస్తోందని, తాము నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం కిమ్మనడం లేదని మండిపడుతున్నారు.
తమ నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే మసీదుల నిర్మాణం జరుగుతోందని, వీటి సంఖ్య పెరగడం వల్ల తమ దైనందిన విషయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అంటున్నారు. లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, రోజూ అజాన్ పిలుపులతో శబ్ద కాలుష్యం కూడా జరుగుతోందని, పిల్లల విద్యాభ్యాసంపై, వృద్ధుల ఆరోగ్యంపై అలాగే మొత్తానికి ఈ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరిస్తున్నారు.
చండీగఢ్ తరహాలోనే…
చండీగఢ్ లో నిర్వాసితుల కోసం ఓ పద్ధతి ప్రకారం పునరావాస కాలనీలను ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం. కర్నాటకలోనూ ఓ ప్రణాళికాబద్ధమైన సెక్టార్లు, పార్కులతో పాటు సకల సౌకర్యాలతో నవనగర్ ప్రాంతాన్ని రూపొందించారు. ఆనకట్ట ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేయడానికి ఇంకా పెద్ద మొత్తంలో భూమి మిగిలే వుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. చాలా మంది నిర్వాసిత కుటుంబాలు ఇప్పటికీ ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, నివాస స్థలాలలో మతపరమైన నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తున్నారని నిలదీస్తున్నారు.
నిరసన చేపడుతున్న స్థానిక హిందువులు….
వరుసగా మసీదుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో స్థానికులు, హిందువులు, హిందూ సంఘాలు బాగల్ కోట్ టౌన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం దగ్గర భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి, తప్పుడు నిబంధనలకు కూడా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదని, బాగల్ కోట్ పట్టణంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే నడుస్తున్నాయని ఆరోపించారు. పదే పదే ఆందోళనలు చేస్తున్నా… అక్రమ మసీదు నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయని విరుచుకుపడుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లోనూ హిందువుల నిరసనలు
అరుణాచల్ ప్రదేశ్ లో నహర్ గులాన్ కి చెందిన ఎస్పీ సంచలన రిపోర్టును హోంశాఖకు సమర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో 12 అక్రమ మసీదుల నిర్మాణం జరిగిందని, అలాగే అక్రమ మదర్సాల నిర్మాణం కూడా జరిగిందని హోంశాఖకు నివేదించారు. అంతేకాకుండా నహర్లాగున్ లోని హెలిప్యాడ్ కి అతి సమీపంలోనే అక్రమ మసీదు నిర్మాణం జరిగిందని, ఇది తీవ్రమైన భద్రతా సమస్యకి మూలకారణం అవుతుందని కూడా నివేదించారు.

2009లో మసీదు నిర్మించిన భూమి 2024 ఆగస్టు 31 నుండి లీజులో ఉంది, అంటే లీజు ఒప్పందంపై సంతకం చేయడానికి 15 సంవత్సరాల ముందు గిరిజనుల భూమిలో మసీదును చట్టవిరుద్ధంగా నిర్మించారు. అయితే ఈ మసీదుకి ప్రభుత్వ అనుమతి గానీ, చట్టపరమైన అనుమతి గానీ, రిజిస్ట్రేషన్ గానీ ఏదీ లేదు. ఇక్కడ 10 మంది పిల్లలకు మత పరమైన బోధన కూడా జరుగుతోంది .
ఇలా ఈ ప్రాంతంలో అక్రమ మసీదులు పుట్టగొడుగుల్లా వస్తున్నాయని అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ (APIYO)ఇదే విషయంపై స్థానిక హిందువులను నిరంతరం జాగృతం చేస్తూనే వుంది.రాజధాని నగరం ఇటానగర్ మరియు సమీప ప్రాంతాలలో అక్రమ మసీదులు మరియు మదర్సాల నిర్మాణాలకు వ్యతిరేకంగా డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ సర్కారు రాజధాని సమీపంలోని అక్రమ మసీదులు, మదర్సాల జాబితాను కూడా అధికారికంగా విడుదల చేసింది.అందులో జామా మసీదు, బోరం మదర్సా, కొంకడ్ మసీదు, నిర్జులి మసీదు, బోడా నంసి మసీదు మరియు ఆరు పంజా ఖానాలు మొదలైనవి వున్నాయి.
అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ ప్రధాన కార్యదర్శి టాపోరే మెయింగ్ మరియు అధ్యక్షుడు టారో సోనమ్ లియాక్ అక్రమ మసీదులను సందర్శించిన సమయాల్లో అక్కడి మౌలానాను భారత్ మాతాకీ జై అనమని కోరారు. దీనికి నిరాకరించారు. అప్పుడు వారు మౌలానాను ఈ విధంగా నిలదీశారు. ‘‘”భారత్ మాతా కీ జై అని చెప్పడానికి నిరాకరిస్తే మీరు భారతీయులు ఎలా అవుతారు?” అంటూ సూటిగానే ప్రశ్నించారు.అస్సాం నుండి వచ్చామని తరచుగా చెప్పే బంగ్లాదేశ్ సంతతికి చెందిన ముస్లింలకు APIYO కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ లోపు రాష్ట్రం విడిచి వెళ్లాలని, లేకుంటే కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది,
మియా చొరబాటుదారులపై అవగాహన పెంచడానికి APIYO నవంబర్ 15 నుండి రాజధాని నగరం ఇటానగర్ నుండి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. వేలాది మంది చొరబాటుదారులు ఈ అందమైన రాష్ట్రంలోకి చొరబడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు మరియు ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని హెచ్చరించింది. అంతేకాకుండా వీరు స్థానికులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు చేస్తున్నారని కూడా స్థానిక ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో డజన్ల కొద్దీ అక్రమ మసీదులు మరియు మదర్సాలు వచ్చాయి.మనం ఇప్పుడు మేల్కొనకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది.ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరూ తమ గొంతెత్తడం లేదు. కానీ చాలా ఆలస్యం కాకముందే మనం చర్య తీసుకోవాలి” అంటూ APIYO చైతన్యం తెస్తోంది.
సిమ్లా ప్రాంతంలోనూ….
సిమ్లాలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మసీదుపై స్థానిక హిందువులు యుద్ధం ప్రకటించారు. దీనిని అక్రమంగా నిర్మిస్తున్నారని, అక్రమాలు కూడా జరిగాయని, దానిని వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇది 30 సంవత్సరాల నాటిది మసీదు. దీని నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిజానికి ఈ మసీదు నిర్మాణ పనులను స్థానిక హిందువులు ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటీముట్టగానే వ్యవమరించింది. ప్రారంభ సమయంలో కేవలం ఒక గదినే వుండగా, ప్రస్తుతం ఐదంతస్తుల భవనం వరకూ వచ్చేసింది. ఇదంతా అక్రమమేనని నివేదికలు చెబుతున్నాయి.

అక్కడి మున్సిపల్ కార్పొరేషనే స్వయంగా ఇది అక్రమ నిర్మాణమని, అనధికారికంగా నిర్మిస్తున్నారని తేల్చేసింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేతకు ఉత్తర్వులు జారీ చేసినా… ఆ తర్వాత దీనిని వెనక్కి తీసుకున్నారు.సంజౌలిలో కొనసాగుతున్న స్టే ఆర్డర్ మరియు సుదీర్ఘ చట్టపరమైన చర్యల కారణంగా హిందువులు మరింత నిరాశకు గురయ్యారు. దీనికి ప్రతిస్పందనగా, హిందూ సంఘర్ష్ సమితి వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ మసీదుకి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెప్పినా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యా లేదని హిందూ సంఘర్ష్ సమితి మండిపడుతోంది.
అయితే.. హిందూ సంఘర్ష్ సమితి సభ్యుడు కమల్ గౌతమ్ ప్రకారం… రెండు సంవత్సరాల క్రితం దీనిని ప్రశ్నించిన సమయంలో ఓ బృందంపై దాడికి దిగిందని, అప్పుడు అసలు విషయం బయటికి వచ్చిందన్నారు.నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఒక మసీదులో ఆశ్రయం కల్పించారని తెలుస్తోంది. దీంతో హిందువులు మరింత ఆందోళనకు దిగుతున్నారు.
దీనిలో మరో కోణం కూడా వుంది. మసీదు నిర్మాణానికి గణనీయమైన నిధులు అందాయని, దీని వల్లే ఐదంతస్తుల నిర్మాఱణం జరుగుతోందని, నమాజ్ కి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కు రాష్ట్రం వెలుపల నుండి వచ్చే వారి సంఖ్య వేగంగా పెరిగిందని, రోజూ రోజూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము చాలా సార్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని, స్థానిక హిందూ మహిళల భద్రతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా గతంలో 3 శాతం ఉండేది, కానీ తక్కువ వ్యవధిలో అది గణనీయంగా పెరిగిందని అన్నారు.బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి ముస్లింలు సహా బయటి నుండి ప్రజలు రావడం ఈ పెరుగుదలకు కారణమని కూడా స్థానిక హిందువులు అంటున్నారు.
కర్నాటక చిత్రదుర్గ ప్రాంతంలో…
సాదిక్ లేఅవుట్ లో అక్రమ మసీదు నిర్మాణంపై పెద్ద వివాదమే రేగింది. గత యేడాది నవంబర్ మాసంలో జరిగింది. దీంతో చిత్రదుర్గ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరైన అనుమతులు తీసుకోకుండా, అక్రమంగా మసీదును నిర్మిస్తున్నారని స్థానిక హిందువులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా సాదిక్ నగర్ చుట్టూయే ఈ వివాదం నడుస్తోంది. అక్కడ 500 మందికి పైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ఓ మసీదు వుంది. అయినా… ప్రధాన రహదారికి సమీపంలోనే అక్రమంగా మరో మసీదును నిర్మిస్తున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మసీదు మున్సిపల్ నిబంధనలకు వ్యతిరేకంగా వుందని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్, చిత్రదుర్గ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ మరియు జిల్లా పరిపాలన విభాగానికి ఫిర్యాదులు దాఖలు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు.
కర్నాటక హుబ్బిళి ప్రాంతంలో…
ఈ ఘటన ఈ యేడాది జనవరి మాసంలో జరిగింది. హుబ్లీలోని నెహ్రూ నగర్ శివనగర్ ప్రాంతంలో ఓ ఇంటినే ఏకంగా మసీదుగా మార్చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు కూడా లేవు. ఇదంతా అక్రమ మసీదు అని హిందువులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా హిందువులు, హిందూ సంఘాలు భారీ నిరసనను నిర్వహించాయి. మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి, ఈ అక్రమ మసీదు నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా ఈ ప్రాంతంలో మత సామరస్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. నిజానికి ఈ ఇంటిని మున్సిపాలిటీ నుంచి నివాసం కోసం అనుమతులు పొందారని, కానీ.. ఇప్పుడు దానిని మసీదుగా మారుస్తున్నారని హిందువులు అంటున్నారు.
యూపీలోని బంబేశ్వర్ ప్రాంతంలో….
యూపీలో అక్రమ మసీదు నిర్మాణంపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని బండా ప్రాంతంలోని బంబేశ్వర్ పర్వతాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్కడ కొన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ స్థలంలో అక్రమ మసీదు నిర్మాణం జరిగింది. ఈ కొండపైనే రాముడు ఒకానొక సమయంలో శివునికి అభిషేకం చేశాడని, అందుకే హిందువులకు ఈ కొండ అత్యంత పవిత్రమైందని స్థానికులు తెలిపారు. అక్కడే అక్రమ మసీదు నిర్మాణం చేశారని స్థానికులు అన్నారు.దీనిపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
భయంకరంగా దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించారని, అదే సమయంలో ముస్లిం ఛాందసులు అక్రమ మసీదు నిర్మించారు. దేశమంతా కరోనా మహమ్మారితో బాధపడుతుంటే వీరు ఇక్కడ అక్రమ మసీదు నిర్మాణం చేశారు. ఈ మసీదును వెంటనే కూల్చేయాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం యోగిని కోరారు.
మొదట ఓ చిన్న నిర్మాణంగా ప్రారంభమైందని, క్రమ క్రమంగా పూర్తి స్థాయి మసీదుగా రూపాంతరం చెందిందని స్థానికులు ప్రకటించారు. పెద్ద పెద్ద సమూహాలుగా ప్రతి శుక్రవారం ప్రార్థనలు కూడా చేస్తున్నారన్నారు. మొదట కొందరే ముస్లింలు వచ్చేవారని, ఇప్పుడు పెద్ద సమూహంలో వస్తున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా పెరగడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వస్తాయని అంటున్నారు.

పురాణాల ప్రకారం ఈ కొండపై వనవాస సమయంలో శ్రీరాముడు వుండేవాడని, శివ లింగాన్ని స్థాపించి, అభిషేకం కూడా చేశాడని నమ్ముతారు. బామ్ దేవ్ భోలేనాథ్ మందిర్ అని పిలుస్తారు. పుట్టన్ మహారాజ్ అని సాధువు ఇక్కడ ప్రతిరోజూ అర్చకత్వం నిర్వహిస్తారు. ఈ సాధువే మొట్ట మొదట అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకించారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సంజౌలి ప్రాంతంలో
హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడు గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నిరసనకారులు, వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేశారు.
దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్‌పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.హమీర్‌పూర్‌లో అధికారులకు నిరసనకారులు వినతిపత్రం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ నిరసనను ఉద్దేశించి ప్రసంగించిన దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ 5 వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయిస్తామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని వెల్లడించారు. తమపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.





