
భారత సైన్యానికి చెందిన ఓ మేజర్ విధుల్లోని సైనికులకు ఉపయోగపడేలా బాలిస్టిక్ బుల్లెట్‌ప్రూఫ్ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసిన మేజర్ అనూప్‌మిశ్రానే ప్రస్తుతం హెల్మెట్‌ను కూడా అభివృద్ధి చేయడం విశేషం. ఈ హెల్మెట్‌కు ఏకే 47తో 10 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినా తట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అబేధ్య ప్రాజెక్టులో భాగంగా మిశ్రా ఈ బాలిస్టిక్ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో ఆయన తయారుచేసిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ స్నైపర్ రైఫిల్స్‌ను కూడా తట్టుకోగలదు. ఇండియన్ ఆర్మీ కళాశాలకు చెందిన ఈ అధికారి.. తన పాత కాలం నాటి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌కు తుపాకీ కాల్పుల ప్రభావం పడటంతో మరో ప్రత్యామ్నాయ జాకెట్ తయారుచేయాలని భావించి దాన్ని రూపొందించారు. అదేవిధంగా ఈ కళాశాల ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ప్రపంచంలోనే అతితక్కువ ధరలో గన్‌షాట్ లొకేటర్‌ను కూడా తయారు చేసింది. పుణెలో ఉన్న ఈ మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల(సీఎంఈ) కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌కు జీఐఎస్ విషయాలతో పాటు.. సీబీఆర్‌ఎన్ రక్షణ సహా పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది.