
0views
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. భారత్ కేవలం భౌగోళిక అస్తిత్వం కాదని ఒక తల్లి అని అన్నారు. వందేమాతరం కూడా జాతీయగీతం జనగనమణకు సమానామైందని వ్యాఖ్యానించారు. కానీ దురదృష్టవశాత్తు దానిని విస్మరిస్తున్నామని అన్నారు. అంతే కాకుండా స్వాతంత్య్రం వచ్చిన తవరాత భారత్ ను తల్లిలా గౌరవించడం కూడా తగ్గిపోయిందన్నారు. తమిళనాడులో వందేమాతరం పోటీలు జరిగే పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి భావోద్వేగబరితైమందని, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని సూచిస్తోందన్నారు. తమిళనాడులో జాతీయ చిహ్నాలు మరియు భాష వాడకంపై వివాదం సాగుతున్న వేళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.




