
44views
రాష్ట్రంలోని కరవు ప్రాంతమైన అనంతపురంలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. అక్కడ వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర నీటి కోరతను ఎదుర్కొంటారని మోదీ అన్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించడానికి ముందుకు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఇప్పటి వరకు 10కి పైగా జలాశయాలను పునరుద్ధరించారని.. 7 వేలకు పైగా చెట్లను నాటారని పేర్కొన్నారు. ఆదివారం మన్‌కీ బాత్ 130వ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు.




