News

హిందూ మహిళలను వేధిస్తూ మతమార్పిడికి ప్రయత్నించిన జిమ్ నిర్వాహకుల అరెస్ట్

33views
యూపీలోని మీర్జాపూర్‌లో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ముస్లిం జిమ్ ట్రైనర్ హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకొని, బలవంతపు మత మార్పిడి చేసినట్లు బయటపడింది. ఇద్దరు మహిళలు ముస్లిం జిమ్ ట్రైనర్ పై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. దీంతో మీర్జాపూర్ పోలీసులు మూడు జిమ్‌లను సీజ్ చేసి, మహ్మద్ షేక్ అలీ ఆలం, ఫైసల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసుల ప్రకారం జిమ్ ట్రైనర్లు మొదట స్నేహం చేసి, ఆ తర్వాత హిందు మహిళలను ట్రాప్ చేశారని పేర్కొన్నారు.అలాగే ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి, ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేసినట్లు మహిళలు ఆరోపించారు.
అలాగే ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు.. విచారణ నిమిత్తం జహీర్, షాదాబ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా జిమ్ నిర్వాహకులతో సంబంధం వున్నవారేనని, మహిళలను లక్ష్యంగా చేసుకొన్నవారేనని పేర్కొన్నారు.