
షహీన్ బాగ్ వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలను కవర్ చేయడానికి వెళ్ళిన ఓ మహిళా విలేకరిపై అక్కడి ఆందోళనకారులు దాడి చేయ్యబోయారు. అక్కడ ఆందోళనకారులు తమకు అనుకూలమైన కొన్ని మీడియా సంస్థలను మాత్రమే అనుమతిస్తుండడంతో ఆమె బుర్ఖా వేసుకుని వెళ్లారు. ఆమె ముస్లిమేతర మహిళ అని తెలుసుకున్న అనంతరం దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో షహీన్ బాగ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మహిళా విలేకరి పేరు గుంజా కపూర్. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా ఆందోళనకారులు కిందటి నెల 26వ తేదీ నుంచి ఏకధాటిగా షహీన్ బాగ్ వద్ద ఆందోళనలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళనకారులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు.

తమ అనుమతి లేకుండా షహీన్ భాగ్ లోకి ఎవ్వరినీ అనుమతించటం లేదు. చివరికి మీడియా వారికి కూడా పాసులిచ్చి, అలా పాసులున్న వారినే అనుమతిస్తున్నారు. అలాంటి పాసులేమీ లేకుండా వెళ్ళిన సీనియర్ పాత్రికేయుడు దీపక్ చౌరాసియాపై కూడా ఆందోళనకారులు దాడి చేసిన విషయం తెలిసిందే.

మీడియాకి ఆందోళనకారులు ఇస్తున్న పాసులు

సీనియర్ జర్నలిస్ట్ దీపక్ చౌరాసియాపై దాడి చేస్తున్న దృశ్యం
ఈ పరిణామాల మధ్య బుధవారం ఉదయం గుంజా కపూర్ అక్కడి వాస్తవ పరిస్థితులను కవర్ చేయడానికి బుర్ఖా వేసుకుని వెళ్లారు. ఆందోళనకారులతో కలిసి పోయారు. అనంతరం ఆమె ప్రవర్తన, మాట తీరు పట్ల కొందరు నిరసనకారుల్లో అనుమానాలు తలెత్తాయి. ఇదే విషయంపై గుంజా కపూర్‌ను నిలదీశారు. దీనితో తడబాటుకు గురైన ఆమె నిరసనకారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వలేకపోయారు. ఫలితంగా- వారిలో అనుమానాలు మరింత బలపడ్డాయి.
#WATCH Political analyst Gunja Kapoor extricated by police after protestors at Delhi's Shaheen Bagh alleged that she was wearing a 'burqa' and filming them. #Delhi pic.twitter.com/llRiKhMvOd
— ANI (@ANI) February 5, 2020
గుంజా కపూర్‌ను చుట్టుముట్టి, బుర్ఖాను తొలగించారు. ఆమె ముస్లిమేత మహిళ అని తెలుసుకున్న అనంతరం దాడికి ప్రయత్నించారు. ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వదల్లేదు. దీనితో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. గుంజా కపూర్‌కు భద్రత కల్పించారు. ఆందోళనకారుల మధ్య చిక్కుకుపోయిన ఆమెను సురక్షితంగా తరలించారు. గుంజా కపూర్ ‘రైట్ నెరేటివ్’ అనే యుట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.





