
విశాఖ సాగర్‌నగర్‌లోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మహా సమ్మేళనంలో భాగంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మందిరంలోని రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి, ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థల నిర్వాహకులైన సుమారు వంద మంది ఆధ్యాత్మిక గురువులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారని ఇస్కాన్ (విశాఖ) అధ్యక్షుడు సాంబాదాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బ్యూరో ఛైర్మన్ భక్తి–రసామృత స్వామి మహరాజ్, భానుస్వామి మహరాజ్, గౌరంగా ప్రభు, రేవతీరామన్ ప్రభు, లోకనాథ స్వామి మహరాజ్, రాధేశ్యామ్ ప్రభు నేతృత్వం వహిస్తున్నారు. సింహాచలం దేవస్థానం ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు. . శ్రీవరాహాలక్ష్మి నృసింహస్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాన్ని అందజేశారు. కార్యక్రమంలో మారుమూల ప్రాంతాలకు కృష్ణచైతన్య ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి విస్తరించాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ సంస్థలను నడిపిస్తున్న సుమారు వంద మంది ఆధ్యాత్మిక గురువులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారని ఇస్కాన్ (విశాఖ) అధ్యక్షుడు సాంబాదాస్ తెలిపారు.




