News

వివాదాస్పద మ్యాప్‌తో నేపాల్‌ కొత్త రూ.100 నోట్లు

115views

భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ (నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌- ఎన్‌ఆర్‌బీ) కొత్త రూ.100 నోట్లను గురువారం విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తయారైనట్లుగా చూపించిన ఈ కొత్త నోట్ల వెనుకవైపు మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగుతో వివాదాస్పద నేపాల్‌ మ్యాప్‌ ఉంది. దీనిపై ఎన్‌ఆర్‌బీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రూ.100 నోట్లపై ఇదివరకే తమ దేశ మ్యాప్‌ ఉందని, 2020లో సవరించిన మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో దానికి అనుగుణంగా కొత్త నోట్లను తాజాగా జారీ చేసినట్లు వివరించారు. మూడు ప్రాంతాలను తమవిగా భారత్‌ పేర్కొంటుండగా.. వాటిని తమ ప్రాంతాలుగా చూపుతూ సవరించిన మ్యాప్‌ను కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 2020లో విడుదల చేసింది. దీనిపై అప్పట్లోనే భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది.