NewsSeva

మొందా తుపాను బాధితులకు సేవా భారతి చేయూత

6views

బంగాళాఖాతంలో ఏర్పడిన మొందా తుపాను ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో పెన్నా తీరం లోతట్టు ప్రాంతాలు మరియు సేవా బస్తీలలో రాష్ట్రీయ సేవా సమితి సేవా భారతి, ఫౌండేషన్‌ కార్యకర్తలు బాధితులను ఆదుకుంటున్నారు.

నెల్లూరు సేవా భారతి ఆధ్వర్యంలో నెల్లూరులోని దీన్ దయాళ్ నగర్, దెయ్యాల దెబ్బ, కల్తీ కాలనీ, అంబేద్కర్ నగర్, దొర తోపు సంఘం, నారాయణ రెడ్డి పేట, RDT కాలనీ, సుందరయ్య కాలనీలోని తుపాను సహాయ పునరావాస కేంద్రాలలో పునరావాసితులకు మంచినీరు, ఆహారాన్ని అందజేస్తున్నారు. సేవా భారతి నెల్లూరులోని సేవా బస్తీలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తుఫాను ప్రభావిత 9 సేవా బస్తిలలో నిర్వాసితులకు 3 వాహనాలలో 28 మంది కార్యకర్తలు మూడు పూటలా భోజనం, అల్పాహారం అందజేశారు.