
46views
హిందూ సమాజానికి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం వుందని, అయితే దానికి సమానంగా అనేక సవాళ్లు కూడా సమాజం ముందు వున్నాయని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు.వారణాసిలో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. గోవధ, అక్రమ మత మార్పిళ్లు, ప్రభుత్వ చేతుల్లో వున్న ఆలయ వ్యవస్థ మొదలైనవి హిందూ సమాజం ముందున్న ప్రధాన సవాళ్లు అని పేర్కొన్నారు. వీటిపై సమాజానికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్బంగా మిలింద్ పరాండే మాట్లాడుతూ.. ఈ కార్యాలయం నివాసానికే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచీ కాశీకి వచ్చే వారికి కూడా సౌకర్యంగా వుంటుందని, వారి ధార్మిక కార్యక్రమాలకు కేంద్రంగా వుంటుందన్నారు.ఇది వ్యక్తిగత ఆస్తి కాదు, కానీ ఒక ప్రజా భవనం, దీని నిర్వహణ కోసం మనం పౌర విధిగా భావించాలని సూచించారు.

కమ్యూనిస్టులు, జిహాదీలు హింసకు పాల్పడుతున్నారన, సమాజంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం హిందువులని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులు కులం, వర్గం, తెగలు అన్న దానిని ఛేదించుకొని, వాటన్నింటికీ అతీతంగా ఎదిగి, హిందువులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. హిందువులపై హిందువులే పోరాడేలా కొందరు కుయుక్తులు పన్నుతున్నారని,అలాంటి వాతావరణాన్ని నిర్మూలించాలన్నారు. ఇలాంటి వాతావరణం సృష్టించే శక్తులను గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయాలన్నారు.
హిందువుల్లో జనాభా రేటు, సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందని, ఇదే జనాభా అసమతౌల్యతకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరాండే అన్నారు. ఇది కాస్తా సామాజిక విభజనకు దారితీస్తోందని విశ్లేషించారు.వీటన్నింటిపై సమాజంలో చర్చ జరగాలని అన్నారు.

నేడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బర్మా, థాయిలాండ్ వంటి సరిహద్దు రాష్ట్రాల నుండి 10 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అన్నారు.ఒక సంవత్సరంలో దాదాపు రూ.40,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి, ఇది మన సంస్కృతిని నాశనం చేయడానికి జరిగిన భారీ కుట్ర అని పేర్కొన్నారు.
మరో వైపు ఈ కార్యక్రమంలో రవిదాస్ మఠానికి చెందిన స్వామీజీ భారత్ భూషణ్ జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ చేస్తున్న పనులను ప్రశంసించారు. హిందూ మతం మరియు సంస్కృతి కోసం హిందూ సమాజాన్ని విస్తృతంగా మేల్కొల్పే పనిలో నిమగ్నమై ఉందని అన్నారు.ఇలాంటి సంస్థల ద్వారానే మన సంస్కృతి తన వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తోందని ప్రశంసించారు.






