News

దీపావళి స్టాంప్‌ను విడుదల చేసిన కెనడా పోస్ట్‌

158views

బహుళ సంస్కృతుల కలయికకు ప్రతిబింబంగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది. దీపావళి పండగ నేపథ్యంలో సంప్రదాయ రంగోలితో కూడిన స్టాంప్‌ను ఆవిష్కరించినందుకు కెనడా పోస్ట్‌కు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలిపింది. ‘‘దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తిస్తూ.. కెనడాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇతర వర్గాలు జరుపుకొనే పండగ దీపావళికి గుర్తుగా స్టాంప్‌ను విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అని కెనడా తపాలా శాఖ ఇటీవల ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 2017 నుంచి కెనడా పోస్ట్‌ ఏటా దీపావళికి స్టాంప్‌ విడుదల చేస్తూ వస్తోంది. ఈ ఏడాది స్టాంప్‌లో భారతీయ కళాకారిణి రూపుదిద్దిన రంగోలి చిత్రంతో పాటు హిందీ, ఆంగ్లంలో దీపావళి అని రాసి ఉంది.